హడలిపోతున్న బెంగుళూరు, ఆచూకీ లేకుండా పోయిన 3 వేలమంది కరోనా.....

కరోనా మహమ్మారి ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోతుంది.రోజు రోజుకు రాష్ట్రాల వ్యాప్తంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి.

 3 Thousand Corona Positive People Missing In Bangalore, Corona Positive, Corona-TeluguStop.com

మరి ముఖ్యంగా కర్ణాటక లో ఈ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ ల తో పాటు కర్ణాటక లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.

అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో మరో పిడుగులాంటి వార్త బెంగుళూరు వాసులను భయాందోళనకు గురి చేస్తుంది.దాదాపు 3 వేల మందికి పైగా కరోనా సోకిన వ్యక్తుల ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కేవలం ఒక్క బెంగుళూరు నగరంలోనే 27 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

మార్చి,ఏప్రిల్ నెలల్లో కేవలం 4 వందల నుంచి 5 వందల కేసుల మాత్రమే ఉన్న కర్ణాటక లో ప్రస్తుతం కేసుల సంఖ్య 85 వేలకు పైగా నమోదు అయ్యాయి.

అలానే మృతులు సంఖ్య కూడా వెయ్యి 7 వందలకు పైగా నమోదైంది.ఇలాంటి సమయంలో 3 వేలమందికి పైగా కరోనా సోకిన వారి ఆచూకీ కనపించకపోవడం తో అధికారులు వారి జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

రెండు వారల క్రితం బెంగుళూరు నగరంలో 16 వేలు మాత్రమే ఉండగా,ఇప్పుడు ఈ సంఖ్య 27 వేలకు పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సుమారు సగం బెంగుళూరులోని కేసులేనని అధికారులు చెబుతున్నారు.దీనికి ఇప్పుడు ఈ 3 వేలమంది కరోనా వ్యక్తులు ఆచూకీ లభించకపోవడం తో ఈ సంఖ్య ఇంకెంత పెరుగుతుందో అన్న అనుమానం అధికారుల్లో వ్యక్తం అవుతుంది.

కోవిడ్-19 రోగుల్లో కూడా చాలామంది పత్తా లేకుండా పోయారని,అనేకమంది తప్పుడు చిరునామాలు, తప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చారని, వారి ఆచూకీ కనుగొనడానికి పోలీసుల సాయం తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.అయితే ఇలాంటి వ్యక్తుల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాపిస్తుందని అధికారులు ఇప్పుడు ఈ పనిలో పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube