తెలంగాణా అమ్మాయి ఘనత..అమెరికా వర్సిటీలో సీటు..!!

తెలుగు రాష్ట్రాలలో ఆణిముత్యాలకి కొదవు లేదు.లెక్కకి మించిన ప్రతిభావంతులు ప్రతీ ఏటా ఎదో ఒక ప్రాంతం నుంచీ తమ విజయదుందుభి మొగిస్తూనే ఉంటారు.

 Telugu States, Telangana, America, Suharsha, Abner University, Telangana Forest-TeluguStop.com

అలాంటి విద్యార్ధుల కోసం విదేశీ కంపెనీలు, ప్రముఖ సంస్థలు రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటాయి.అలా తెలుగు రాష్ట్రాల నుంచీ విదేశాలు వెళ్లి స్థిరపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

తాజాగా తెలంగాణా కి చెందిన ఓ విద్యార్ధిని కి ఇలాంటి అవకాశమే వచ్చింది.దాంతో తెలంగాణ సిఎం కుమార్తె కవిత ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశారు.

వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలో ప్రఖ్యాత అబ్నర్ యూనివర్సిటీలో సీటు సాధించడం అంటే మాటలు కాదు.

ఎంతో టాలెంట్ ఉంటే తప్ప అక్కడ అంత సులువుగా సీటు రాదు.కానీ తెలంగాణా రాష్ట్రం సింగరేణి కుటుంభానికి చెందిన సుహర్ష అబ్నర్ యూనివర్సిటీలో సీటు సాధించింది.

చిన్నతనం నుంచీ చదువుల్లో ముందు ఉండే సుహర్ష తెలంగాణా ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చేసింది.అయితే ఈ క్రమంలోనే తెలంగాణా ఫారెస్ట్ కాలేజీ కి మరియు అబ్నర్ యూనివర్సిటీకి మధ్య ఎంవోయూ ఉండటంతో అబ్నర్ యూనివర్సిటీలో లో ఎంఎస్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీలో సీటు సాధించింది.

అంతేకాదు సుహర్ష కు యూనివర్సిటీ తరుపునుంచీ రూ.25 లక్షల ఫీజు రద్దు తో పాటుగా సుమారు 1500 డాలర్లు స్కాలర్షిప్ కూడా లభించనుంది.అయితే కేసీఆర్ తనయ కవిత స్పందించారు.సుహర్ష తెలంగాణా రాష్ట్రానికే గర్వకారణమని శుభాకాంక్షలు తెలిపారు.ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడిన కవిత ఆమెకి ఎలాంటి అవసరమైన తాను చెస్తానని హామీ ఇచ్చారు.అంతేకాదు గతంలో కవిత కూడా ఇలాంటి ఘనత సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube