ఫ్లాస్మా దానంపై ప్రచారం చేస్తున్న టాలీవుడ్ స్టార్స్

కరోనా మహమ్మారి ఓ వైపు తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటే భారత్ లో వైద్యులు నిరంతరం శ్రమతో మరణాల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా కీలక పాత్ర పోషిస్తుంది.

 Tollywood Celebrities Campaign For Plasma Donation, Tollywood, Corona Effect, Co-TeluguStop.com

కరోనా వచ్చి కోలుకున్న రోగుల నుంచి ప్లాస్మాని సేకరించి ఇతర కరోనా రోగులకి అందిస్తున్నారు.ఈ ట్రీట్మెంట్ ద్వారా కరోనాతో బాధపడుతున్న వారు వేగంగా కోలుకుంటున్నారు.

ఇక చాలా మంది కరోనాని జయించిన వారు ప్లాస్మా దానంకి ముందుకొస్తున్నారు.ఇక కరోనా మరణాలని మరింత నియంత్రించేందుకు ప్లాస్మా దానం ఆవశ్యకత గురించి సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలు పెట్టారు.

ఇక ఈ ప్రచారానికి టాలీవుడ్ స్టార్స్ కూడా తమ మద్దతు తెలియజేయడంతో పాటు వారు కూడా ప్లాస్మా దానంపై ట్వీట్ చేశారు.

కరోనా రోగులకు చికిత్సలో విశేషంగా ఉపకరించే ప్లాస్మాను దానం చేయాలంటూ కరోనా నుంచి కోలుకున్నవాళ్లను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్థించారు.

ఇప్పుడు కావాల్సింది ప్లాస్మాయేనంటూ సైబరాబాద్ పోలీసులు ప్లాస్మా దానం గురించి ప్రచారం చేస్తున్నారు.కరోనాను జయించిన వ్యక్తులందరూ తమ ప్లాస్మాను దానం చేయాల్సిందిగా అర్థిస్తున్నాను.ముందుకొచ్చి ప్లాస్మా దానం ప్రక్రియలో పాలుపంచుకోండి.తద్వారా కరోనా రోగుల ప్రాణాలు కాపాడండి.

మీరూ ఓ ప్లాస్మా యోధుడిగా నిలవండి అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో పిలుపునిచ్చారు.ఇప్పటికే ఈ ప్లాస్మా దానం ప్రచారానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు పలికారు.

కరోనా నుంచి కోలుకున్న అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.దయచేసి మీ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రండి.

తద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడండి.కరోనా కష్టకాలంలో ఇంతకుమించిన మానవతా సాయం మరొకటి ఉంటుందని అనుకోను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

అలాగే స్వీటీ అనుష్క కూడా ప్లాస్మా దానం చేయడానికి కరోనాని జయించిన వారు ముందుకి రావాలని పిలుపునిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube