ముక్కు,నోరు కాకుండా వాటి నుంచి కూడా కరోనా..!

కరోనా మహమ్మారి రోజు రోజుకు తన మనుగడను పెంచుకుంటూ పోతుంది.మొన్నటివరకు ముక్కు,నోరు ద్వారా శరీరంలోకి ఈ మహమ్మారి ప్రవేశిస్తుంది అని అందరూ భావించారు, అయితే ఇప్పుడు తాజా గా జరిపిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు వ్యక్తం అయ్యాయి.

 Corona Will Spread Through Ears Also, Corona Virus, Corona Vaccine, Who, Virus S-TeluguStop.com

ఈ మహమ్మారి కేవలం ముక్కు,నోరు ద్వారానే కాకుండా చెవుల నుంచి కూడా ఈ కరోనా వ్యాపిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.కరోనా సోకి మరణించిన రోగుల చెవుట్లో మస్టాయిడ్ లో ఈ వైరస్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించినట్లు తెలుస్తుంది.

దీనితో ఈ మహమ్మారి చెవుల ద్వారా కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.అయితే అసలు ఈ వైరస్ మనిషి శరీరం లో నుంచి చెవుల్లోకి వెళుతుందా లేదంటే చెవుల నుంచే శరీరంలోకి ప్రవేశిస్తుందా అన్న అనుమానాలు మాత్రం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే నోరు,ముక్కు ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి నోటికి మాస్క్, ముఖానికి షీల్డ్ పెట్టుకొని తిరుగుతున్నారు.

ఇప్పుడు ఈ మహమ్మారి చెవుల నుంచి కూడా వ్యాపిస్తుంది అని నిపుణులు చెప్పడం తో ఇక జనాలు ఏమి ధరించి బయటకురావాల్సి పడుతుందో చూడాలి.

ఈ మహమ్మారికి ఎలాంటి మందు లేకపోవడం తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర కు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 6 లక్షల 40 వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

రోజు రోజుకు ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మహమ్మారికి ప్రతి ఒక్కరూ తమ తమ జాగ్రత్తల్లో ఉండాల్సిందే అంటూ పదే పదే హెచ్చరిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube