నలంద కిషోర్ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి..!

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నలంద కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 Chandrababu, Nalanda Kishore, Tdp Leaders, Ganta Srinivasarao,-TeluguStop.com

వైసీపీ తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేక నలంద కిషోర్ కలత చెందారని చంద్రబాబు అన్నారు.

సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో నలంద కిషోర్‎పై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు ఆరోపించారు.

వృద్ధుడని కూడా చూడకుండా అరెస్ట్ చేసి స్టేషన్ల చుట్టూ తిప్పారని విమర్శించారు.నలంద కిషోర్ వయసును కూడా చూడకుండా విశాఖ నుంచి కర్నూలు తీసుకుపోయారని తెలిపారు.ఆయన ఏమైనా తీవ్రవాదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.నలంద కిషోర్‎ది ప్రభుత్వం చేసిన హత్య అని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

65 ఏళ్ల నలంద కిషోర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ నేపథ్యంలో అతనికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.సోషల్ మీడియాలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై అభ్యంతకర పోస్టులను షేర్ చేశాడంటూ జూన్ 23వ తేదీన సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవలే ఆయన బెయిల్‎పై విడుదల అయ్యారు.కాగా, నలంద కిషోర్ అరెస్టుపై గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube