దానిమ్మ.ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
దానిమ్మపండులో విటమిన్ బి, సి కె తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇక అనేక వ్యాధులతో పోరాడే లక్షణం ఉన్న దానిమ్మను డైట్‌లో చేర్చుకుంటే.గుండె జబ్బులను, క్యాన్సర్, మధుమేహం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అయితే దానిమ్మ ఆరోగ్యానికే కాదు.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి చర్మానికి దానిమ్మను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని దానిమ్మ గింజలను తీసుకుని.బాగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి.
అర గంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి.
అలాగే దానిమ్మ రసంలో కొద్దిగా శెనగపిండి మిక్స్ చేసి.ముఖానికి, మెడకు పట్టించాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.ట్యాన్ రిమూవ్ అవ్వడంతో పాటు చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.పొడి చర్మంతో బాధపడేవారు.
దానిమ్మ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేయాలి.
అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తుంటే ముఖం మృదువుగా, తేమగా మారుతుంది.అలాగే దానిమ్మ గింజల పేస్ట్ లో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.పావు గంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముడతలు తగ్గి.చర్మం యవ్వనంగా, అందంగా మారుతుంది.