పిచ్చుకల కోసం 35 రోజులు చీకట్లోనే ఉన్న గ్రామం.. ఎక్కడంటే?

ప్రస్తుతం మనిషి అధునాతన జీవనశైలి… పిచ్చుకలను రోజు రోజుకి కనుమరుగయ్యేలా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.0 సినిమా లో స్పష్టంగా చూపించారు.అయినప్పటికీ ఎవరు కూడా పిచ్చుకలను కాపాడడానికి అంతగా ఆసక్తి చూపరు.

 Village, Darkness, 35 Days, Sparrows , Tamilnadu , Tamil Nadu Village Turned Of-TeluguStop.com

ఇక్కడ గ్రామం మాత్రం పిచ్చుకల కోసం పెద్ద సాహసమే చేసింది.పిచ్చుకలను రక్షించడానికి ఏకంగా 30 రోజుల పాటు చీకట్లోనే బతికింది ఆ గ్రామం.

యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది గ్రామం.తమిళనాడులోని శివగంగై జిల్లాలో జరిగింది ఈ ఆసక్తికరమైన.

పోత కుడి గ్రామంలో స్ట్రీట్ లైట్ స్విచ్ బోర్డు లో ఇండియన్ రాబిన్ పిచ్చుక గూడు కట్టుకుంది.పిచ్చుక గుడ్లు పెట్టి పొదుగుతుంది.ఆ వీధి లైట్లు ఆన్ చేయాలంటే ఆ గూడును తొలగించాల్సి ఉంటుంది.కానీ తొలగించ కూడదని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.

ఒక్క తాటిపైకి వచ్చి పొదిగిన గుడ్లు పిల్లలు తయారయ్యేంతవరకు 30 రోజుల పాటు దీపాలు లేకుండానే గ్రామస్తులు చీకట్లో గడిపారు.

Telugu Days, Darkness, Sivaganga, Sparrows, Tamilnadu-Latest News - Telugu

గ్రామస్తులంతా ఇలా ఒక్కతాటిపైకి వచ్చి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక విద్యార్థి కారణం అని తెలుస్తోంది.20 ఏళ్ల ఓ విద్యార్థి… స్ట్రీట్ లైట్ ఆన్ చేసే బోర్డు లో ఏదో ఉందని గమనించి వెంటనే పరిశీలించి… వెంటనే ప్రెసిడెంట్ ని కలిసి అసలు విషయం చెప్పాడు.అంతరించిపోయే దశలో ఉన్న పిచ్చుకలను కాపాడాలి అంటూ కోరడంతో.ప్రెసిడెంట్ అలా స్ట్రీట్ లైట్స్ ఆన్ చేయకుండా ఉండేందుకు అంగీకరించాడు.30 రోజుల తర్వాత ఆ పిచ్చుకలు బయటకు రాగానే స్ట్రీట్ లైట్లను ఆన్ చేసింది ఆ గ్రామం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube