పిల్లనగ్రోవి వాయిస్తూ ఎంజాయ్ చేస్తున్నకరోనా రోగులు

సంగీతానికి ప్రకృతి సైతం పరశించిజేసే శక్తి ఉందనటంలో ఏలాంటి సందేహాం లేదు.అందులోనూ మధరమైన మరళీగానానికి ప్రత్యేకస్థానం ఉంది.

 Coronavirus Patients, Assam, Quarantine Centre,playing Flute,group Of Men  Dance-TeluguStop.com

బృందావనంలో శ్రీ కృష్ణుడు పిల్లనగ్రోవి వాయిస్తుంటే గోమాతలు సైతం తన్మయత్వంతో నాట్యం చేసేవట.అందుకే చక్కటి వేణుగానానికి ఎలాంటి మానసిక సమస్యలైనా మాయం చేసే శక్తి ఉందని భావిస్తారు.

అయితే, ఈ దృశ్యం చూస్తే ఇప్పుడు అది అక్షరాల నిజమే అనిపిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి ఆత్మీయులకు దూరంగా కార్వంటైన్ కేంద్రంలో ఉన్న కాలం వెళ్లబుచ్చుతున్న కరోనా రోగులు సైతం పిల్లనగ్రోవి విని తన్మయత్వంతో నృత్యం చేశారు.

తమ సమస్యలన్ని మర్చిపోయి హాయిగా గడిపారు.

అసోంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకటంతో వైద్యాధికారులు అతడిని కార్వంటైన్ కేంద్రానికి తరలించారు.

ఈ క్రమంలో తనలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదని తన వద్ద ఉన్న పిల్లనగ్రోవి తీసి వాయించాడు.అంతే ఇక అక్కడ ఉన్న మిగతా రోగులు అతడి వాయిద్యానికి మైమరచిపోయి డ్యాన్స్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతుంది.అయితే, ఇలాంటి కార్యక్రమాలు బాధితుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాయని వైద్య సిబ్బంది అంటున్నారు.

అక్కడే కాదు దేశ వ్యాప్తంగా క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులు సందడిగా గడిపేలా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ కేంద్రం అంటే జైలులో గడిపటమే అనే ఫీలింగ్ కలగకూడదని రోగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు వైద్యసిబ్బంది.

ఈ క్రమంలోనే క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులంతా కలిసి ఓ పాటకు గ్రూప్ డ్యాన్స్ చేసిన వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube