ముంబై బ్యూటీ హన్సిక దేశముదురు చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.
ఇక వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి ఆఫర్లు లేకపోవడంతో ఆమె వేరే భాషల్లో సినిమాలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.ఈ క్రమంలో తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈ బొద్దు బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ వైపు ఆశగా చూస్తోంది.
ముంబై బ్యూటీ అయిన హన్సిక చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్లో నటించిన సంగతి తెలిసిందే.హీరోయిన్గా మారిన తరువాత కూడా అడపాదడపా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.కానీ చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించకపోవడంతో ఆమెను అక్కడి జనాలు పట్టించుకోలేదు.దీంతో ఇప్పుడు ఎలాగైనా బాలీవుడ్లో ఓ అదిరిపోయే సినిమాలో నటించి మెప్పించాలని చూస్తోంది ఈ బ్యూటీ.
ఈ క్రమంలోనే బాలీవుడ్ చిత్రాల ఆఫర్ల కోసం అమ్మడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇప్పటికే పలు నిర్మాణ కంపెనీలకు ఈ మేరకు సమాచారం కూడా అందించిందట ఈ బ్యూటీ.
బాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుని అక్కడే ఉండిపోవాలని చూస్తున్న హన్సిక, ఎలాంటి పాత్రల్లో నటిస్తుందో చూడాలి.అయితే అమ్మడికి అక్కడి స్టార్ హీరోలు ఏదైనా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
మరి ఈ బ్యూటీ బాలీవుడ్లో హీరోయిన్గా లేటుగా వచ్చి లేటెస్ట్ గుర్తింపును క్రియేట్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.