చైనాలో వింత: చేప తిన్నాడు.. కాలేయం మాయమైంది?

ప్రపంచాన్ని నాశనం చేసే కరోనా వైరస్ ని పుట్టించిన దేశం అది.వారి ఆహారపు అలవాట్ల వల్లే ఈ వైరస్ పుట్టిందని ఎందరో వైద్య నిపుణులు వారిపై విమర్శలు చేశారు.

 Chinese Man Loses Half His Liver To Flesh Eating Parasites Chinese Man, Half Liv-TeluguStop.com

వారి ఆహారపు అలవాట్లు మారితేనే ఆరోగ్యంగా ఉండగలరని సలహాలు కూడా ఇచ్చారు.కానీ ఉపయోగం లేదు.

మళ్లీ అలానే తింటున్నారు.ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలుగు రోజుల నుండి విపరీతమైన ఆకలి, విరేచనాలు, అలసట, కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు.

దీంతో అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఎందుకంటే కాలేయం సగం మాయమవ్వడమే కాకుండా అందులో 19 సెంటీ మీటర్ల పొడవు, 18 సెం.మీ.వెడల్పు ఉన్న చీము గడ్డ కనిపించింది.

అవి ఏంటి అని పరీక్షించగా అది ప్లాట్‌ వార్మ్స్ అనే పురుగులు అని వైద్యులు తెలుసుకున్నారు.దీంతో వెంటనే చికిత్స చేసి గడ్డల్లోని చీమును సగం వరకు తొలగించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు కాలేయాన్ని కూడా కొంతవరకు తొలిగించేశారు.ఇంకా తొలిగించిన వాటిలో బల్బుల తరహాలో ఉన్న చిన్న చిన్న పరాన్నజీవి గుడ్లు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

అయితే చికిత్స అనంతరం బాధితుడు ఆహారపు అలవాట్లు తెలుసుకోగా వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అతడు చేపలను ఉడక బెట్టకుండా పచ్చిగా తింటానని తెలిపాడు.చేపల్లో కంటికి కనిపించని జీవులు ఉంటాయని వాటి బ్యాక్టీరియా కూడా శరీరంలోకి ప్రవేశించి క్రమేనా అనారోగ్య సమస్యలకు గురి చేస్తాయని వైద్యులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube