మగాడిగా మారిపోయిన ఒకప్పటి హీరోయిన్

ఈ మధ్యకాలంలో పేస్ యాప్ లు ఎక్కువగా వస్తున్నాయి.ఈ యాప్ లతో యుక్త వయస్సులో ఉన్నవారు వృద్ధాప్యంలో ఎలా ఉంటారు.

 Star Heroine Kushbu Sundar Transform Into Man Look Photo Go Viral, Tollywood, Ko-TeluguStop.com

అలా వృద్ధాప్యంలో ఉన్న వారు టీనేజ్ లో ఎలా ఉండేవారు.అలాగే అమ్మాయిలు అబ్బాయిలుగా మారితే ఎలా ఉంటారు అనే విషయాన్ని ఫోటో మార్ఫింగ్ ద్వారా చేసి చూపిస్తున్నాయి.

ఫోటో మార్ఫింగ్ సరదాగా ఉండటంతో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు.సెలబ్రిటీలు కూడా తమని తాము వృద్ధాప్యంలో ఎలా ఉంటామో అని చూసుకుంటున్నారు.

అలాగే ఉన్నపళంగా మగాడిగా మారిపోతే ఎలా ఉంటామో అని చెక్ చేసుకుంటున్నారు.తాజాగా సీనియర్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ నటి ఖుష్బూ కూడా తాను మగాడిగా మారిపోతే ఎలా ఉంటానో అని ఒకసారి చూసుకుంది.

ఫన్నీగా అనిపించడంతో ఆ ఫోటోలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది.

పేస్ యాప్ తో తన లుక్ చేంజ్ చేసుకొని మగాడిగా ఎలా ఉన్నానో అని చూసుకున్న ఖుష్బూ ఆ ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేసి నేను మగాడిగా మారిపోతే ఇలా ఉంటా, మరీ అంత చండాలంగా అయితే లేను అని ట్వీట్ చేసింది.

ఇప్పుడు ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అలాగే నెటిజన్లు ఆ ఫోటోలు చూసి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.జంబలకిడిపంబ సినిమాని ఒకసారి గుర్తుకు చేసుకుంటున్నారు.మొత్తానికి టెక్నాలజీ ఎన్ని మాయలైనా చేస్తుంది.

మనుషులని ఎలా అయిన మార్చేసి చూపిస్తుందని ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది.ఖుష్భూ షేర్ చేసిన ఫోటోలు ఫన్నీగా ఉండటంతో మరికొంత మంది హీరోయిన్స్ కూడా మగాడిగా మారిపోతే తాము ఎలా ఉంటామో అని ఇప్పుడు ఒకసారి చూసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube