ఏపీలో దళిత యువకుడికి శిరోముండనం

ఏపీలో దారుణ ఘటన వెలుగులోని వచ్చింది.పోలీస్ స్టేషన్ లోనే ఓ దళిత యువకుడిని కొట్టి, ఆ తర్వాత అతడి తలపై వెంట్రుకలు తొలగించారు.

 Ap, East Godavari, Police,ap Dalit Man-TeluguStop.com

ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో ఈ ఘోర సంఘటన సంభవించింది.

పోలీస్ స్టేషన్ లోనే ఓ దళిత యువకుడిని విపరీతంగా కొట్టారు.ఆ తర్వాత శిరోముండనం చేశారు.

అసలేం జరిగిందని ఆ బాధితుడిని విచారించగా.ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు.స్థానిక ముని కూడలి వద్ద ఇసుక లారీలను ఆపానని, ఆ సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టాడని బాధితుడు ఆరోపించాడు.ఇసుక తరలింపుపై ప్రశ్నించినందుకు తిరిగి అతడిపైనే వైసీపీ నేత అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

సీతానగరం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారని, తీవ్రంగా కొట్టి తల వెంట్రుకలు తొలగించారని వాపోయాడు.తప్పు చేయని చోట కఠినంగా శిక్షించారని, తప్పు చేసింది ఎవరో తెలుసుకోకుండానే పోలీసులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డాడు.

బాధితుడికి తీవ్ర గాయాలవ్వడంతో అతడిని రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

విచారణ నిమిత్తం డీఎస్పీ బాధితుడి గ్రామమైన వెదుళ్లపల్లిలోని వరప్రసాద్ ఇంటికి సందర్శంచారు.

బాధితుడి వివరాలు సేకరించారు.కేసుకు సంబంధించిన వివరాలును పరిశీలించారు.

కాగా, సీతానగరంలో ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశాడు.ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు వ్యతిరేకం చూపాయి.

పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube