కరీంనగర్‎లో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్ జిల్లాలో శుద్ధమైన నీటి సరాఫరా కోసం శాతవాహన వర్సిటీలో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‎ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం మానేరు తీరంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మొక్కలు నాటారు.

 Ktr Launches Drinking Water Project In Karimnagar-TeluguStop.com

రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఐటీ టవర్‎ను ‎కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు 30ఏళ్ల ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో గ్రామీణ ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కరీంనగర్‎లో ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుందని అన్నారు.ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతోందని అన్నారు.30 ఏళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.మరోవైపు బీడు భూములకు గోదావరి, కృష్ణా జలాలను పారిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు.

కరీంనగర్ జిల్లాలో త్వరలో తీగల వంతెనను పూర్తి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కరీంనగర్‎కు కొత్త శోభను తెచ్చే అలుగునూరు చౌరస్తాను సుందరమైన జంక్షన్‎గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.హైదరాబాద్‎కు పరిమితమైన టీహబ్ ఇప్పుడు కరీంనగర్‎లో ఏర్పాటు కాబోతోందని స్పష్టం చేశారు.

జిల్లాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కరీంనగర్ వాసులు సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube