గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్‎ఫర్డ్ శాస్త్రవేత్తలు..!

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి.కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న వేళ.ఆక్స్‎ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త తెలిపింది.కరోనా నియంత్రణకు రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని ఆక్స్‎ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది.

 Carona Vaccine, Oxford University, Good News, Oxford Scientists-TeluguStop.com

ఈ వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన డేటాను లాన్సెట్ మెడికల్ జర్నల్‎లో ఫలితాలను ప్రచురించింది.‏ ఆక్స్‎ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక ప్రతిస్పందన గుణం పెరిగిందని వెల్లడించారు.ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని.దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హెూర్టన్ తెలిపారు.

మొదటి నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఆక్స్‎ఫర్డ్ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచింది.

ఈ క్లినికల్ ట్రయల్స్‎లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.వీరిలో యాంటీబాడితో పాటు తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని ఆక్స్‎ఫర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.వాటిని పారాసిటమాల్‎తో తగ్గించగలిగారని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు ఉపయోగపడుతుందో లేదో తెలియాలంటే.మరికొన్ని పరీక్షలు జరగాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube