మీసం, గడ్డం తీసేసిన మెగా స్టార్... అందుకేనట...

తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 60 శాతం చిత్రీకరణ పనులు కూడా పూర్తయ్యాయి.

 Chiranjeevi, Tollywood Megastar,  Beard Less Look, Acharya, Tollywood-TeluguStop.com

కానీ ఇప్పటివరకు ఆచార్య చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయాలను బయటకు రానివ్వకుండా చిత్ర యూనిట్ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.అలాగే ఆ ఫోటో గురించి పలు విషయాలు కూడా బాగానే నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో ముఖ్యంగా ఇటీవలే ఆచార్య చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి యంగ్ లుక్ లో కనిపించడం కోసం  తన మీసం, గడ్డం తీసే సాడని మెగాస్టార్ అభిమానులు బలంగా చర్చించుకుంటున్నారు.అలాగే ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే వైరల్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది.దాంతో ఈ సారి ఎలాగైనా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తన అభిమానులను అలరించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అలాగే మలయాళంలో మంచి విజయం సాధించిన లూసిఫర్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube