విక్రమ్ కి జోడీగా మాళవిక మోహనన్... మాస్టర్ కి ముందే మరో క్రేజీ ఆఫర్

మాళవిక మోహనన్.ఇప్పుడు సౌత్ లో ఈ పేరు గట్టిగా వినిపిస్తుంది.

 Malavika Mohanan Romance With Chiyaan Vikram, Kollywood, Tollywood, South Cinema-TeluguStop.com

మలయాళీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా 2013 లో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకుంది.ఇప్పటి వరకు కెరియర్ లో ఆరు సినిమాలే చేసినా కూడా రాని గుర్తింపు రజినీకాంత్ పెట్టా సినిమా ద్వారా సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో నటిగా కోలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్శించిన మాళవిక మోహనన్ నెక్స్ట్ ఏకంగా ఇళయదళపతి విజయ్ కి జోడీగా మాస్టర్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

ఈ సినిమా థియేటర్ లోకి రాకముందే మరో క్రేజీ ఆఫర్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది. చియాన్ విక్రమ్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ ని ఫైనల్ చేశారు.ఈ సినిమాలో మరో కీలక పాత్రలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కూడా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కరోనా సిచువేషన్ నుంచి బయట పడిన తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.నార్త్ భామల తరహాలో ఎక్స్ పోజింగ్ చేయకపోయినా కూడా ఈ అమ్మడుకి కోలీవుడ్ పెద్దపీట వేస్తుంది.

ఇక నితిన్ కి జోడీగా ఈ భామ ఒక సినిమాలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది.మొత్తానికి మలయాళీ భామలైన కీర్తి సురేష్, అనుపమ, అను ఇమాన్యుయేల్ తరహాలో సౌత్ లో ఈ అమ్మడు కూడా గట్టిగా పాగా వేస్తుందేమో వేచి చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube