కారు నెంబర్ ‘కోవిడ్-19’.. కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయింది!?

ఏంటి ? కొన్ని నెలల ముందే కోవిడ్-19 ఆ? అని షాక్ అవుతున్నారా? అవును.ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విమానాశ్రయంలో పార్కు చేసిన ఓ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Bmw Car With Mysterious Covid19 Number Plates Abandoned At Airport Since Februar-TeluguStop.com

ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.బూడిద రంగులో ఉన్న ఈ కారును సుమారు ఫిబ్రవరి నెలలో పార్కు చేశారని విమానాశ్రయ పార్కింగ్ సిబ్బంది తెలిపారు.

అయితే ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏంటి అంటే? ఆ కారుపై కోవిడ్-19 అని ఉందని.అలాంటి నెంబర్ ప్లేటు తో కారు ఎలా వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు.ఈ కారు నెంబర్ రిజిస్ట్రేషన్ పరిశీలించగా ఆ కారు నెంబర్ ను కేవలం సెప్టెంబరు 2020 వరకు రిజిస్టర్ చేసి ఉన్నట్లు తెలిసింది.

ఆ కారుకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.కాగా ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ లాక్‌డౌన్ విధించడం వల్ల విమానాశ్రయ సిబ్బందిలో ఒకరు కారును అక్కడే పార్కు చేసి వెళ్లిపోయి ఉండచ్చు అంటున్నారు.

అయితే ఇన్ని రోజులు ఆ కారుకు కవర్ వేసి ఉందని, ఇటీవల వీచిన ఈదురు గాలుల వల్ల కవర్ పైకి లేవడంతో కారు నెంబరు ప్లేటు కనిపించిందని విమాశ్రయ సిబ్బంది ఒకరు తెలిపారు.

దీంతో ఈ కారు గురించి అధికారులకు పూర్తిగా వివరాలు తెలిసి ఉంటాయని.

యజమాని ప్రైవసీ నిమిత్తం వివరాలను బయటకు రావడం లేదని మరికొందరు అంటున్నారు.కాగా కోవిడ్-19 అని పేరు ఎందుకు రిజిస్టర్ చేశారు? దీని వెనుక రహస్యం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు.ఏది ఏమైనా ఈ కారు నెంబర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube