ఆవు, ఎద్దుల ప్రేమ.. చూడటానికి రెండు కళ్ళు చాలవు..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్ కనీసం… మనసుకి దగ్గరైన మనిషిని కూడా దగ్గర తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సామాజిక దూరం కీలకంగా మారింది.

 Madurai Cow And Bull Love Viral In Internet, Coronavirus, Madurai, Cow And Bull,-TeluguStop.com

మనుషుల మధ్య దూరం పెరుగుతోంది.మనుషులనే కాదు కరోనా వైరస్ ప్రభావం మూగజీవాలను కూడా దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏకంగా అప్పటి వరకు కలిసి ఉన్న మూగజీవాలు విడిపోవడంతో ఎంతగానో తల్లడిల్లిపోయాయి.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పాలమేడు లో జరిగింది.

కరోనా వైరస్ ప్రభావం కారణంగా పాలమేడు కు చెందిన ఓ రైతును ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.దీంతో చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న అవును పక్క గ్రామం రైతుకు విక్రయించాడు.

కానీ మూగజీవాల మధ్య ఉన్న ప్రేమను మాత్రం ఆ రైతు అర్థం చేసుకోలేకపోయాడు.ఈ క్రమంలోనే ఆ అవును తీసుకెళ్లడానికి వాహనం వచ్చింది.వాహనంలో ఎక్కించారు.కానీ ఇన్ని రోజుల నుంచి తనతో పాటు కలిసి ఉన్న ఆవు దూరమై పోతుందని ఆ ఎద్దు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయింది.

దీంతో అవును తీసుకెళుతున్న వాహనాన్ని ఎంతోసేపు అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

అయినప్పటికీ వాహనం ముందు వెళ్లిపోవడంతో కొద్దిదూరం పాటు ఆ అవును చూస్తూ వాహనం వెనకాలే పరుగులు పెట్టింది ఎద్దు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ గా మారిపోయింది.కేవలం మనుషుల మధ్య కాదు మూగ జీవాల మధ్య కూడా ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది అని ఈ వీడియో అందరికీ అర్థం అయ్యేలా చేస్తుంది.

ఇక ఈ విషయం తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు జయ ప్రదీప్ వరకు వెళ్లడంతో… వెంటనే ఆవును మళ్లీ రైతు దగ్గరికి వచ్చేలా చేశాడు.మళ్లీ ఆ ఆవు, ఎద్దు ఒక్కటయ్యాయి.

దీంతో స్థానికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube