కాపు ఉద్యమానికి ఇక సెలవు అంటున్న ముద్రగడ

కాపు ఉద్యమం అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం.ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన కూడా తర్వాత కేవలం కాపు రిజర్వేషన్ కోసం ఆ పార్టీకి దూరమై ఉద్యమ నాయకుడిగా మారారు.

 Mudragada Middle Kapi Reservation Agitation, Ap Politics, Ysrcp, Janasena, Tdp-TeluguStop.com

అప్పటినుంచి తరచుగా కాపు రిజర్వేషన్ కోసం ఏదో ఒక రూపంలో ఉద్యమం చేస్తున్నారు.అయితే గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం చేసిన కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.

ఆ సమయంలో ఉద్యమం హింసాత్మకంగా మరి ట్రైన్ దగ్ధం చేసేంతవరకు వెళ్ళింది.కాపు ఉద్యమం సెగ చంద్రబాబు నాయుడుకి ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ప్రభావం చూపింది.

ఈ ఉద్యమం తర్వాత కాపులలో మెజారిటీ వర్గం వైసిపికి అండగా నిలబడ్డారు.అలాగే కాపు నేతలు అందరూ కూడా వైసీపీ పార్టీలో చేరిపోయి టికెట్లు కూడా సంపాదించుకున్నారు.

అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది గెలిచి పదవులు కూడా పొందారు.ముద్రగడ కూడా వైసీపీ అండదండలతోనే కాపు ఉద్యమాన్ని నడిపారని కథనాలు వినిపించాయి.

ఇదిలా ఉంటే మరల ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ నిధులు దారి మళ్ళించడం, దానిపై ముద్రగడ లాంటి ఉద్యమ నేతలు పెద్దగా స్పందించకపోవడంతో చాలామంది అతని ఉద్యమాన్ని, వ్యక్తిత్వం తప్పుపట్టారు.కొంతమంది కాపు నేతలు కూడా ముద్రగడ కేవలం చంద్రబాబు మీద అక్కసుతోనే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపించారని విమర్శలు చేశారు.

అలాగే జనసేన పార్టీ మీద కాపు కమ్యూనిటీ ఆలోచనలు మళ్ళించడానికి ముద్రగడ డ్రామాలు ఆడారని విమర్శలు గుప్పించారు.కేవలం వైసిపికి లాభం చేకూర్చడానికి మాత్రమే ముద్రగడ ఆరోజు హడావుడి చేశారని విమర్శలు చేశారు.

దీనిపై ఆయన తీవ్ర కలత చెందినట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా తన నిబద్ధతను ప్రశ్నిస్తూ చేస్తున్న విమర్శలపై ఆవేదన చెందుతున్నట్లు తాజాగా ఒక లేఖలో పేర్కొన్నారు.

అలాగే కాపు ఉద్యమం నుంచి కూడా సెలవు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.కాపు రిజర్వేషన్ కోసం ఎప్పటికి కూడా పోరాటం చేయండి తెలిపారు.

అయితే ఉన్నఫలంగా ముద్రగడ ఇలా ప్రకటించడంపై ఆయన వర్గంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube