వామ్మో... టాయిలెట్ల కోసమూ మ్యూజియం ...!

నిజానికి ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ పైన వాటి ఉపయోగంపై అవగహన ఉండే ఉంటుంది.టాయిలెట్స్ ఉండడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు భావించి ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమం ముందు కంటే మరుగుదొడ్ల వ్యవస్థాపన ఉద్యమం చేపట్టారు.

 Sulabh International Museum Of Toilets, Toilets, Museum, Unique Museum-TeluguStop.com

ఆయన టాయిలెట్స్ పై 1992 వ సంవత్సరంలో ఢిల్లీలో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.ఇది మిగతా మ్యూజియంల కంటే విభిన్నమైనది.

కాబట్టి అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.అంతేకాదు అనేక మంది దేశ అధినేతలు, ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా ఈ మ్యూజియాన్ని దర్శించారు.

టాయిలెట్స్ మ్యూజియం అంటే అక్కడేదో మురికి కంపు వచ్చే భవనం కానేకాదు.అది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్‌లో భాగమై ఈ ప్రదర్శనశాల అత్యాధునికంగా, ఆలోచింపజేసేలా ఉంటుంది.

ఈ మ్యూజియాన్ని నెలకొల్పడం కోసం ఏకంగా మూడు దశాబ్దాల క్రితం సులభ్ సంస్థ ఎంతో కష్టపడాల్సి వచ్చింది.అయితే ఈ మ్యూజియం దేశ రాజధాని ఢిల్లీ లో ఉండడంతో అనేకమంది అధికారులతో సంప్రదించడం కారణంగా వారి పని సులువైంది.

వారి సహకారంతోనే వివిధ దేశాల నుండి టాయిలెట్ కు సంబంధించిన పూర్తి వివరాలను, అలాగే నమూనాలను సేకరించారు.


Telugu Museum, Toilets, Unique Museum-

నిజంగా ఇలాంటి సంపూర్ణ మ్యూజియాన్ని నెలకొల్పడం అంటే మామూలు మాటలు కాదు కదా.ఇక ఈ మ్యూజియం లో చైనాకు చెందిన టాయ్ టాయిలెట్స్, అమెరికాలోని ఎలక్ట్రిక్ టాయిలెట్, జపాన్ దేశంలో వినియోగించే అత్యాధునిక ఎలక్ట్రానిక్ టాయిలెట్లను మనం ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో చూడవచ్చు.అంతే కాదు వివిధ రకాలైన టాయిలెట్ నిర్మాణాల ను, అలాగే వివిధ దేశాల్లో ఉపయోగించే వివిధ రకాల టాయిలెట్స్ మనం అక్కడ ఫోటోల ద్వారా వీక్షించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube