పవన్ కావాలంటూ మారం చేస్తున్న తమ్ముళ్లు ?

ప్రస్తుత పరిస్థితిని పక్కన పెట్టేసి, పూర్తిగా 2024 ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.ఈ మేరకు వచ్చే ఎన్నికల నాటికి ఏ రకమైన వ్యూహాలు రూపొందించుకుని ముందుకు వెళితే, విజయాన్ని దక్కించుకోవచ్చు అనే లెక్కలు వేసుకుంటున్నట్టు గా కనిపిస్తోంది.

 Telugu Desam Party With Alliances With Janasena, Janasena, Tdp Janasena And Bjp-TeluguStop.com

ఏపీ అధికార పార్టీ వైసీపీ కి 151 సీట్లు రావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అని టిడిపి బలంగా నమ్ముతోంది.టీడీపీ జనసేన కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ పరిస్థితి దాపురించేది కాదని, కానీ జనసేనను కలుపు కు వెళ్లకుండా, ఒంటరిగా పోటీ చేయడం వల్ల చాలా నష్టపోవడంతో పాటు, ఊహించని విధంగా అపజయాన్ని మూటగట్టుకావాల్సి వచ్చింది అంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆవేదనతో విశ్లేషించుకుంటున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బాగా ఓట్లు చీల్చిందని, వాస్తవంగా అవన్నీ టీడీపీ ఖాతాలో పడాల్సిన ఓట్లు అని, విడివిడిగా పోటీ చేయడం కారణంగానే మెజారిటీ సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని లెక్కలు వేసుకుంటున్నారు.ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు, టీడీపీ అభ్యర్థుల మీద గెలిచిన మెజారిటీ కంటే, జనసేన అభ్యర్థులు ఎక్కువగా ఓట్లు చీల్చారు అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది.

ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి అవకాశం లేకుండా ఉండేదని, కనీసం టీడీపీ జనసేన కూటమికి 50 -70 సీట్లు పైగా వచ్చేవని, అప్పుడు వైసీపీకి ఇంత మెజారి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.విడివిడిగా పోటీ చేయడం వల్ల 2019 ఎన్నికల్లో ఘోరంగా రెండు పార్టీలు ఓడిపోవాల్సి వచ్చిందని, భవిష్యత్తులో ఎటువంటి తప్పు జరగకుండా ఉండాలంటే, జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని, వైసీపీకి కూడా ఆదరణ తగ్గుతుంది అని టీడీపీ అంచనా వేస్తోంది.

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpjanasena-

అందుకే ఇప్పటి నుంచే జనసేనను దగ్గర చేసుకోవాలనే అభిప్రాయం మెజార్టీ టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.ఇక చంద్రబాబు సైతం ఇదే లెక్కలు వేసుకుంటున్నారు.ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, అది పెద్ద ఉపయోగం లేదని, రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లినా, పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో ఉన్నారు.చాలా నియోజకవర్గాల్లో కీలక నాయకులంతా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, జనసేన తో పొత్తు పెట్టుకోవాలి అంటూ అధినేతపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులు చూసుకున్న జనసేన తో కలిసి ముందుకు వెల్లక పోతే 2024 లోనూ వైసీపీ మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటున్న అనే అభిప్రాయం చంద్రబాబు సైతం ఉన్నట్లు గా కనిపిస్తోంది.ఇక పవన్ బీజేపీ తో పొత్తు పెట్టుకున్నా, మనసంతా టీడీపీ వైపే ఉన్నట్టుగా ఆ పార్టీ అంచనా వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube