వినూత్న పధకం,ఆవు పేడను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం!

గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఒక వినూత్న పధకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.జులై 20 నుంచి గోధన్ న్యాయ్ యోజన పధకాన్ని ప్రారంభించనుంది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం.

 Chhattisgarh To Procure Cow Dung From Farmers For Vermicompost, Chhattisgarh, Ve-TeluguStop.com

ఈ పధకం కింద గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి పేడను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది.జులై 20 న హరేలీ పండుగ సందర్భంగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

ఈ పధకం కింద ప్రభుత్వం వినూత్నంగా ఆవు పేడను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది.కిలో పేడను రూ.1.50 కి కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది.వ్యవసాయం పనుల ప్రారంభం సందర్భంగా ఏటా హరేలీ పండగను నిర్వహిస్తారు.ఈ సందర్బంగా గోధన్ న్యాయ్ పథకాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ఆవుపేడను కొనుగోలు చేస్తారు.

ఈ పేడను ఉపయోగించి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేయనున్నట్లు తెలుస్తుంది.ఈ గోధన్ న్యాయ్ పథకం కోసం అందరికీ కార్డులు జారీ చేస్తారు.ప్రతి రోజూ అమ్మిన పేడ వివరాలను అందులో నమోదు చేస్తారు.స్వయం సహాయక బృందాలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తాయి.

అనంతరం కొనుగోలు తేదీ, ఎంత పేడ అమ్మారు? అనే వివరాలు కార్డులో నమోదు చేస్తారు.ప్రతి 15 రోజులకు ఓసారి ఆన్‌లైన్ ద్వారా లబ్ధి దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు.

పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయింలో గోధన్ కమిటీలు, పట్టణ స్థాయిలో పురపాలక సంఘాలు పనిచేస్తాయి.గోధన్ న్యాయ్ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగేల్ అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube