వామ్మో... మద్యం ప్రియులు ఇంత తాగేస్తున్నారా ...?

రోజురోజుకి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ విధంగా సోకుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో విస్తృతంగా కేసులు నమోదవుతున్నాయి.

 My God, That Much Of Alcohol Drinking Drinkers , Telangana, Hyderabad, Liquor, C-TeluguStop.com

ఇక ఇదే నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో లాక్ డౌన్ విధిస్తారంటూ కొన్ని ప్రచారాలు జోరందుకున్నాయి.ఈ విషయం విన్నారో లేదో మద్యం ప్రియులు ఎక్కడ లాక్ డౌన్ మొదలు పెడితే మళ్లీ మద్యం దుకాణాలు మూసుకుంటాయన్న ఉద్దేశంతో మద్యం దుకాణాలకు పరుగులు పెట్టారు.

లాక్ డౌన్ విధిస్తే మాత్రం మద్యం దొరకదేమోన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్తగా మద్యం కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే జూన్ 26 నుండి 30 వ తారీఖు వరకు మధ్యలో ఏకంగా తొమ్మిది వందల కోట్ల పైగా విక్రయాలు అందుకున్నయంటే ఏ రేంజ్ లో విక్రయాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ విధించక పోయినా హైదరాబాద్ నగరం సగం వరకు ఖాళీ అయిందని చెప్పవచ్చు.

నిజానికి కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సన్నగిల్లడంతో మద్యం దుకాణాలు తెచ్చుకోవడంతో రాష్ట్ర ఖజానాకు ఇప్పటివరకు దాదాపు ఐదు కోట్ల వరకు ఆదాయం వచ్చి చేరింది.

దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త నిలదొక్కుకునేలా పరిస్థితి ఏర్పడింది.అయితే మందుబాబులు ఈ నెల 1 వ తారీకు నుండి కూడా అధిక మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube