టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం

సరిహద్దులో గల్వాన్ ఘటన తర్వాత చైనా ఉత్పత్తులని, యాప్ లని నిషేధించాలనే డిమాండ్ ఇండియాలో విపరీతంగా వినిపిస్తుంది.ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకి వచ్చి చైనాకి వ్యతిరేకంగా వారికి సంబందించిన ఉత్పత్తులని దగ్ధం చేయడం, అలాగే యాప్ లని డిలేట్ చేయడం చేస్తున్నారు.

 India Bans 59 Chinese Apps Including Tiktok, China, Ban China Apps, Digital Indi-TeluguStop.com

ఓ విధంగా చెప్పాలంటే భారతీయులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే చైనా సంస్థలకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.అయితే చైనా నుంచి వస్తువుల దిగుమతి విషయంలో భారత్ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసే అవకాశం లేదు.

కాని సెక్యూరిటీ నిబంధనలు అనుసరించి ఆ దేశానికి చెందిన యాప్ లని నిషేధించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఎంతో ప్రజాదరణ పొందిన టిక్ టాక్ యాప్ తో పాటు సహా 59 యాప్ లను నిషేధించింది.భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి, దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను అడ్డుకుంటున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ జాబితాలో టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వుయ్ చాట్, వీగో వీడియో, హలో యాప్, షేర్ ఇట్, బ్యూటీ ప్లస్ వంటి యాప్స్ ఉన్నాయి.వీటిలో ఎక్కువ యాప్స్ ఇండియా డిజిటల్ మార్కెట్ లో మెజారిటీ భాగం ఆక్యుపై చేసేసాయి.

ఈ నేపధ్యంలో వీటిపై ప్రభుత్వం నిషేధం విధించి వీటిని ప్రజలని ఎలా దూరం చేస్తాయి అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube