ఎట్టిపరిస్ధితిలోను జులై 17వ తేదీలోగా అలా చెయ్యాల్సిందే.. లేకపోతే చాలా డేంజర్..!!

మొదటి నుండి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కొంచెం దూకుడు ఎక్కువే.ఏదైన సరే తన కోణంలో నే ఆలోచించడం ఆయన అలవాటు.

 Los Angeles Court Give The Order To Trump Governament About Immigrations Illigal-TeluguStop.com

ఈ విషయాని ఆయన చాలా సార్లు ప్రూవ్ చేస్తూన్నే వచ్చారు.భారతీయులు అమెరికా వెళ్తే.

అక్కడున్న అమెరికన్లకి ఉద్యోగ కొరత ఏర్పడుతుందని, ముందే గ్రహించి ఏకంగా H1B వీసా జారీ ప్రక్రియను టెంపరరీ గా ఆపేసాడు.ఇలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడం ట్రంప్కి కొత్తేమి కాదు.

గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చాలానే తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా.

అమెరికాకు అక్రమంగా వలస వచ్చారన్న అభియోగంతో పలు కుటుంబాలను నిర్బంధించి నిరవధికంగా నిర్బంధ కేంద్రాలలో ఉంచిన ట్రంప్ సర్కార్ కు భారీ షాక్ తగ్గిలింది.అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన వారి కోసం ఉద్దేశించిన నిర్బంధ కేంద్రాల్లో తల్లిదండ్రులతో పాటు ఉన్న పిల్లలను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్‍ ప్రభుత్వాన్ని లాసేంజిల్స్ కోర్టు ఆదేశించింది.

అక్రమ వలసదారుల కోసం టెక్సాస్‍, పెన్సిల్వేనియాలో మూడు నిర్బంధ కేంద్రాలు ఉన్నాయి.ఇక్కడ కుటుంబ సభ్యులందర్నీ నిర్బంధించే అవకాశం ఉంది.ఈ మూడు కేంద్రాల్లో సుమారు మొత్తం 184 మంది పిల్లలు ఉన్నారు.

Telugu America, Coronavirus, Donald Trump, Lock, Angels-Telugu NRI

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మొదట్లో అమెరికా కరోనా నుండి తప్పించుకునింది అనుకున్నా.ఆ తరువాత ట్రంప్ చేతకాని తనంతో ఒక్కసారిగా కరోనా కేసులు సంఖ్య దూసుకుపోయింది.

అది ఎలా అంటే.ఏకంగా ప్రపంచ స్దాయిలో కరోనా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యానిదే అగ్రస్దానం అన్నట్లు.

కరోనా మరణాల్లలో ను అమెరికాదే పై చెయ్యి.ఆ తరువాత కొంత వరకు పరిస్దితులు అదుపులోకి వచ్చాయి అనుకున్నా.

మళ్లీ కరోనా అమెరికలో తన పంజా విసురుతుంది.గత వారం రోజుల నుండి మళ్లీ పాజిటివ్ కేసులు ఎక్కవ సంఖ్యలో నమోదు అవుతున్నాయి.

దీనిని దృష్టిలో పెట్టుకుని.ఈ క్రమంలో వలసదారుల పిల్లల ఆరోగ్యంపై లాస్‌ఏంజెల్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.యూనైటెడ్ స్టేట్స్ ఫ్యామిలీ ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో ఉన్న సుమారు 100 మందికి పైగా పిల్లలను విడుదల చేయాలని ఆదేశించింది.ఇప్పటికే దేశంలోని మూడు ఫ్యామిలీ నిర్బంధ కేంద్రాలలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇంకా కూడా ఆలస్యం చేస్తే మరింత డేంజర్ అని కోర్టు తెలిపింది.

ఎట్టి పరిస్ధితిలోను జులై 17వ తేదీలోగా వారిని తల్లిదండ్రులతో సహా విడుదల చేయాలని, లేదంటే ఆదరించే వ్యక్తుల వద్దకు పంపించాలని సూచించింది. నిర్బంధ కేంద్రాల్లోనూ కరోనా వైరస్‍ వ్యాపిస్తున్న దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube