అమెరికాలో నాయకత్వం లేదు..బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ట్రంప్ పై అన్ని వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సాఫ్ట్ వేర్ దిగ్గజ అధినేతలు సైతం ట్రంప్ వైఖరిపై పెదవి విరచడం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో సందేహాలని కలిగిస్తోంది.

 Bill Gates,america,corona Effect, Presidential Elections, Bill Gates Comments On-TeluguStop.com

ఇప్పటికే కరోనా, నల్లజాతీయుల హత్య ఉదంతాలపై అమెరికా యావత్ ప్రజానీకం ట్రంప్ పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.తాజా సర్వేలు సైతం ట్రంప్ మరో సారి అధికారంలోకి రావడం అసంభవమని తేల్చి చెప్పేశాయి.

ఈ క్రమంలోనే ప్రజలలో కొద్దో గొప్పో ట్రంప్ పై ఉన్న సాఫ్ట్ కార్నర్ ని ప్రముఖ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తుడిచి పెట్టేశారు.

బిల్ గేట్స్ అంటే అమెరికా వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలకి ఎంతో స్పూర్తి వంతమైన వ్యక్తిగా అభిమానిస్తారు.

అలాంటి వ్యక్తి అమెరికాలో ప్రస్తుత పరిస్థితులపై నాయకత్వ లేమిపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్ పై ఈ ప్రభావం తీవ్ర స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు నిపుణులు.అమెరికాలో ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశించి బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.

ఇంతకీ బిల్ గేట్స్ ఏ విషయంపై స్పందిచారు.ఏమన్నారంటే.

అమెరికా నాయకత్వం కరోనాని ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యిందని, కరోనాపై ట్రంప్ చేపట్టిన చర్యలపై బిల్ గేట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.అమెరికా నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోందని ప్రపంచ వ్యాప్తంగా కరోన మహమ్మారి ఊహించిన దానికంటే కూడా తీవ్ర రూపం దాల్చిందని అన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్ , బ్రెజిల్ లో సైతం కరోనా తీవ్ర స్థాయిలో ఉగ్ర రూపం దాల్చందని అయినా కట్టడి చేయడంలో సఫలం అవుతున్నారని, త్వరలోనే అమెరికాలో కరోనాకి మందు కనిపెడుతారని ఆశిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube