అయ్యా బాబోయ్... ఊరంతా కంటోన్మెంట్ జోన్ ..! కారణం తెలుసా ..?

ప్రభుత్వ అధికారులు కరోనా నియంత్రణ కోసం ఎంత తీవ్రంగా కష్టపడుతున్నా ప్రజలు మాత్రం వారికి సహకరించకుండా ఇబ్బందులను సృష్టిస్తున్నారు.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వినోదాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఎంత చెప్పినా చాలామంది పట్టించుకోకుండా వారి పని మాత్రం చేసుకుంటూ వెళుతున్నారు.

 Containment Zones, Hoem Quarantine, Ranga Reddy, Corona Patients, Corona Positiv-TeluguStop.com

ఇలాంటి చిన్నచిన్న తప్పిదాలు చాలా పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పిన ప్రజలు వాటిని బేఖాతరు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే… రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం నక్కలగుట్ట తండాలో లో ఇటీవల ఓ విందు నిర్వహించగా, అక్కడ హాజరైన ఒక వ్యక్తి ద్వారా ఏకంగా ఏడుగురికి కరోనా వ్యాపించింది.

ఇక దీంతో సదరు తాండా మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్ చేశారు అధికారులు.ఈ పరిస్థితి తో తండాలో ఉంటున్న 40 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నాయి.2 వారాల క్రితం తండాలో నిర్వహించిన ఓ విందుకు తండాలోని ప్రజలు, ఓ కుటుంబానికి చెందిన చాలామంది బంధువులు హాజరయ్యారు.అందులో ఒకరు ఎల్ బి నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఆ తండాలో ఒకరి ఇంట్లో మూడు రోజులు ఉన్నాడు.

ఇక ఆ సమయంలో అతనికి జ్వరం రావడంతో పాటు నీరసించి పోవడంతో అతనిని హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయగా అతనికి కరోనా పాజిటివ్ గా తేలింది.అయితే మూడు రోజుల క్రితం అతను బసచేసిన ఇంట్లోనే ఓ మహిళకు అతని కుమారుడికి కరోనా పాజిటివ్ గా తేలింది.

ఇక వారిద్దరినీ హోమ్ క్వారంటైన్ లో నిర్బంధించారు.అంతేకాదు కరోనా రోగి పాల్గొన్న విందులో మరో ఐదు మందికి కూడా శనివారం నాడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ విందుకు హాజరైన మరికొందరిని పరీక్షలు నిర్వహించామని ఆ రిపోర్టర్ ల కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube