స్టార్ బ్యూటీకి చుక్కలు చూపెట్టిన చిన్నది

కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోల పక్కన బిజీ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బ్యూటీ, గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

 Malavika Mohanan Beats Nayanthara, Malavika Mohanan, Nayanthara, Kollywood News,-TeluguStop.com

కాగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలోనూ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఓ యంగ్ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో నయనతారకు చుక్కలు చూపెడుతోందట.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మాళవికా మోహనన్ అప్పుడే కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.అంతేగాక ఈ బ్యూటీ చేస్తున్న సినిమా పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మాళవికా పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, ప్రేక్షకులను ఆమె ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక మాస్టర్ చిత్రానికి గాను మాళవికా మోహనన్ ఏకంగా రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది.అయితే స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం కేవలం రూ.4 కోట్లు మాత్రమే తీసుకుంటుంది.ఇలా సుదీర్ఘమైన కెరీర్‌ను ఎస్టాబ్లిష్ చేసుకున్న నయన్‌ను రెమ్యునరేషన్‌తో మాళవికా దాటేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక మాస్టర్ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తోండగా మరో స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube