దాని కోసం మళ్ళీ తీవ్రంగా శ్రమిస్తున్న గోవా బ్యూటీ... 

తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తన జీరో సైజు నడుముతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఒకప్పుడు తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి చేతినిండా వరుస అవకాశాలతో బాగానే రాణించింది.

 Ileana D'cruz, Tollywood Actress, Zero Size Figure, Tollywood, Devadasu Movie De-TeluguStop.com

అయితే ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి ఈ అమ్మడి మనసు బాలీవుడ్ సినీ పరిశ్రమ వైపు మళ్ళింది.దీంతో అనుకున్నదే తడవుగా మూటాముల్లె సర్దుకుని ముంబయి చెక్కేసింది.

అయితే అక్కడికి వెళ్ళిన కొత్తలో అవకాశాలు బాగానే వహించినప్పటికీ ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఒకానొక దశలో ఈ అమ్మడి చేతిలో అవకాశాలు లేక ఇంటి పట్టునే ఉండటంతో పూర్తిగా బరువు పెరిగి పోయింది.

దీంతో అవకాశాల మాట అటుంచితే పూర్తిగా ఫిట్నెస్ కోల్పోయి జీరో సైజ్ నుంచి బొద్దుగుమ్మ లా మారిపోయింది.

దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు వరించడం లేదు.

దాంతో ఎలాగైనా ఈ గోవా బ్యూటీ ఇలియానా బరువు తగ్గించుకొని మళ్లీ జీరో సైజ్ నడుము కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.ఇందులో భాగంగా ఎక్కువ సేపు జిమ్ లో కసరత్తులు చేస్తూ గడుపుతోంది.

ఈ విషయానికి సంబంధించి నటువంటి కొన్ని ఫోటోలు కూడా ఈ మధ్యనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీన్ని బట్టి చూస్తే ఇలియానా మళ్లీ జీరో సైజ్ నడుముతో తొందర్లోనే మన ముందుకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube