ఆయన దగ్గర నేర్చుకునేందుకు రెడీ అవుతోన్న ఆర్ఆర్ఆర్ హీరోలు

టాలీవుడ్ బిగ్గె్స్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

 Ntr Ram Charan As Students To Ajay Devgn, Ntr, Ram Charan, Rrr, Ajay Devgn, Raja-TeluguStop.com

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఇటీవల చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఆయన చేయబోయేది ఎలాంటి పాత్ర అనే ప్రశ్నకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో కొమురం భీం, అల్లూరి సీతారామరాజులకు యుద్ధవిద్యలు నేర్పే గురువు పాత్రలో అజయ్ దేవ్గన్ నటిస్తాడట.అయితే కొమురం భీం, అల్లూరి సీతారామరాజులు వాస్తవానికి ఎప్పుడూ కలుసుకోలేదు.

కానీ ఈ సినిమాను ఫిక్షనల్ కథగా తెరకెక్కిస్తున్న రాజమౌళి వారిద్దరినీ కలిపి చూపిస్తాడట.అయితే వారిద్దరికి ఢిల్లీలో అజయ్ శిక్షణ ఇస్తాడని, అందుకే ఆ పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఇప్పటికే అజయ్ దేవ్గన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కొంత మేర పూర్తి చేశాడు.అయితే త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్‌లో మళ్లీ పాల్గొననున్న అజయ్, తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube