ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన పైలట్ ,కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ముఖ్యంగా మహారాష్ట్ర,ఢిల్లీ,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ వైరస్ తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది.

 Air India Pilot Tests Positive For Covid-19 After Landing Flight In Sydney From-TeluguStop.com

తాజాగా ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ.

ఆ తరువాత పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో ల్యాండ్ అయిన తరువాత పైలట్‌తో పాటు కాక్ పిట్‌లో ఉన్న మరో ఇద్దరు సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించినట్లు తెలుస్తుంది.

ఈ విషయంపై ఎయిర్ ఇండియా సంస్థ మాట్లాడుతూ.విమానయానానికి సిద్ధమయ్యే పైలట్‌లకు తాము ముందుగానే పరీక్షలు చేస్తామని, ఆ క్రమంలో ఈ నెల 16న జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా వచ్చిందని, అందుకే పైలట్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు.

ఈ క్రమంలోనే ఈ నెల 20 న సదరు పైలట్ కు విమానం నడిపే అవకాశం లభించింది అని, అంతేకాకుండా ఆ పైలట్ మామూలుగా లాగోస్‌కి వెళ్లాలని కానీ సిడ్నీకి వెళ్లే పైలట్‌కి బాలేకపోవడంతో.లాగోస్‌కి వెళ్లాల్సిన ఈ పైలట్‌ని సిడ్నీకి పంపినట్లు తెలిపారు.

అయితే ఎయిర్‌ ఇండియాలో ఇలా జరగడం ఇది రెండో సారి.గత నెల 30న ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లిన పైలట్‌కు కరోనా వచ్చిందని తెలీడంతో.

మార్గమాధ్యమంలోనే అతడు వెనక్కి రావాల్సి వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా మరో పైలట్ కు కూడా కరోనా పాజిటివ్ రావడం తో ప్రయాణికులు కలవర పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube