వామ్మో కోతి... ఏకంగా 250 మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు ...!

కల్లు తాగిన కోతి కుదురుగా ఉండదని పెద్దలు చెబితే ఊరికే అనుకున్నాం.కానీ అది నిజమని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ కోతి నిరూపించింది.

 The Monkey Who Bitten 250 People Was Sentenced To Life Imprisonment,monkey,monke-TeluguStop.com

మద్యానికి అలవాటు అయిన ఓ కోతిని జూ అధికారులు జైలులో బంధించి జీవిత ఖైదు కూడా చేశారు.ప్రపంచంలో ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు.

కానీ మన దేశంలో జరిగింది.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….

ఆరు సంవత్సరాల క్రితం మిర్జాపూర్ జిల్లాలో పుట్టింది ఆ కోతి.దానిపేరు కల్వ.ఇక ఆ కోతిని పెంచుకుంటున్న ఓ వ్యక్తి దానికి మద్యం అలవాటు చేశాడు.దీనితో ఆ కోతికి మద్యం పూర్తిగా అలవాటు అయిపోయింది.

పూర్తిగా మద్యానికి బానిసైన ఆ కోతికి ఇప్పుడు మద్యం తెచ్చుకున్న పక్కనే కూర్చుని తాపించేవాడు ఆ వ్యక్తి.అంతేకాదు మంచింగ్ కోసం చిరు తిండ్లు కూడా అందించేవాడు.

ఇదంతా బాగా ఉన్న కొద్దిరోజులకి తనను చూసుకునే వ్యక్తి మరణించడం జరిగింది.ఇక దాంతో ఆ కోతికి మద్యం అందించే వారు లేరు.

మద్యానికి పూర్తిగా బానిసైన ఆ పెద్ద కోతి కి పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింది.ఇక దాంతో ఆ కోతికి పూర్తిగా పిచ్చి పట్టినట్టుగా ఎవరు కనబడితే వారి మీద దాడి చేస్తూ కోపంతో ఆవేశంతో కొరకడం కొనసాగించింది.

దీనితో అటవీ అధికారులకు ఎంత ప్రయత్నం చేసిన చివరికి ఓ రోజు దొరికింది.అయితే ఆ సమయానికి జరగాల్సిన నష్టం జరిగింది.

అప్పటికే 250 మందికి ఆ కోతి కరవడం జరిగింది.తాజాగా అందులో ఒకరు మరణించడం కూడా జరిగింది.

ఇలా పట్టుకున్న కోతిని కొన్ని రోజుల పాటు ఒక ప్రత్యేక బోనులో ఉంచి దాని ప్రవర్తనలో మార్పు వచ్చిన తర్వాత దాన్ని బయటకు తీసి మిగితా కోతుల గుంపుతో ఉంచి చూశారు.కానీ బయటికి తీసిన తరువాత అదే కోపం, ఆవేశంతో ఉన్న దానిని చూసి మళ్ళీ ఓ ప్రత్యేక బోనులో బంధించారు.

ఇక ఆ జూ డైరెక్టర్ ఆ కోతి జీవిత కాలం అలాగే ఉంచుతామని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube