డాక్టర్లు అవసరం లేదు.. వాసనతో కుక్కలు కరోనా ను కనిపెడతాయి..?

కరోనా వైరస్ పరీక్షలు జరపకుండానే కరోనా వైరస్ సోకిన రోగికి గుర్తించవచ్చా అంటే అవును అనే అంటున్నారు ప్యారిస్ కి చెందిన పరిశోధకులు.అది కూడా ఎలా అనుకుంటున్నారా… కుక్కల సహాయంతో…? మరి కుక్క లు ఎలా గుర్తిస్తాయి అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుందే.? ఎలాగంటే కరోనా వైరస్ పేషెంట్స్ దగ్గర వచ్చే చెమట వాసన ఆధారంగా ఇక్కడ శునకాలు ఏకంగా కరోనా వైరస్ ను గుర్తిస్తాయట.ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది పరిశోధకులు చెబుతున్న మాట.

 Dogs Detect Corona By Smell, Coronavirus, Dogs, Trained Dogs, Malaria, Cancer, B-TeluguStop.com

మనుషుల్లో మలేరియా, క్యాన్సర్ లాంటి వ్యాధులు గుర్తించేలా శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ప్రస్తుతం కరోనా వైరస్ గుర్తించేలా ఇవ్వడంలో భాగస్వాములయ్యారు.అయితే ఈ శునకాలు ఏకంగా చెమట వాసన చూసి కరోనా ను పసిగడతాయి.

బెల్జియం మోనోలిస్ షాఫర్డ్ జాతికి చెందిన శునకాలకు ఆల్ఫోర్డ్ లోని నేషనల్ వెటర్నరీ స్కూల్ లో … ఇలా చెమట ఆధారంగా కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

అయితే వారి ప్రయత్నం వృధా కాలేదు వారు ఇచ్చినట్టుగానే…చెమట వాసన ఆధారంగా కరోనా వైరస్ ను గుర్తిస్తున్నాయి ఈ శునకాలు .మొదట సాధారణ వ్యక్తులు, కరోనా వైరస్ పేషెంట్ నుంచి నమూనాలను సేకరించి కుక్కలకి వైరస్ను గుర్తించే సామర్థ్యం ఉందో లేదో అని పరిశీలించగా… 8 కుక్కల్లో నాలుగు కుక్కలు ఈ టెస్ట్ లో పాస్ అయ్యయి.ఈ నేపథ్యంలో ఇలాంటి కిట్లు లేకపోయినప్పటికీ… శునకాల ద్వారా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చునని అంటున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube