లాక్ డౌన్ లో ఇన్ని లక్షల అబార్షన్ల..?

లాక్ డౌన్ లో లక్షల అబార్షన్లు జరిగాయి.లాక్ డౌన్ లక్షల అబార్షన్లు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.? తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి.లాక్ డౌన్ లో ఏకంగా 18 లక్షలకు పైగా అబార్షన్లు జరిగినట్లు ఇక్కడ ఈ సర్వేలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి.

 In Lock Down Doing So Many Abortions,show The Survey Report, Lock Down, Abortion-TeluguStop.com

ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ సంచలన నిజాలు తెర మీదికి వచ్చాయి, ఇంతకీ ఏం జరిగింది తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సంస్థ లాక్ డౌన్ సమయంలో మహిళలకు అందిన వైద్య సేవలపై ఒక సర్వే నిర్వహించింది.

అయితే మహిళలు సురక్షిత చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటుంది ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్.కాగా తాజాగా లాక్ డౌన్ సమయంలో ముఖ్యంగా మార్చి 25 నుంచి మే 3 వరకు లాక్ డౌట్ సమయంలో 18.5 లక్షల అబార్షన్లు జరిగాయని ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ఈ అబార్షన్లు కూడా ఎలాంటి గైనకాలజిస్టు సలహా లేకుండానే జరిగాయని సంచలన నిజాలు బయటపడ్డాయి.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో… వైద్య సిబ్బంది మొత్తం ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించడం లోనే నింగ్నమయ్యారు .ఫలితంగా వివిధ వైద్య సేవలు అందించడంలో వైద్యుల కొరత ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది అని ఫౌండేషన్ సీఈవో వినోజ్ మానింగ్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube