కింగ్ నాగార్జున చివరిగా హిట్ అందుకున్న సినిమా సోగ్గాడే చిన్ని నాయనా ఆ సినిమా తర్వాత అతను చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.వర్మతో చేసిన ఆఫీసర్, అలాగే రాహుల్ తో చేసిన మన్మధుడు 2 రెండూ ప్రేక్షకులని దారుణంగా నిరుత్సాహ పరిచాయి.
ఈ నేపధ్యంలో ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న నాగార్జున సల్మాన్ అనే కొత్త దర్శకుడుతో వైల్డ్ డాగ్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.ఇందులో నాగార్జున కమాండోగా కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది.ఇంతలో లాక్ డౌన్ రావడంతో చివరి షెడ్యూల్ వాయిదా పడింది.
ఈ షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోలో ఫారిన్ సెట్ వేసి షూట్ చేయాలని నాగార్జున భావిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగార్జున సినిమా ఎవరితో ఉంటుంది అనే చర్చ నడుస్తుంది.
ఇప్పుడు తెరపైకి గరుడవేగతో సూపర్ సక్సెస్ కొట్టిన ప్రవీణ్ సత్తారు పేరు తెరపైకి వచ్చింది.గరుడవేగా స్టైల్ లోనే ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ ని ఇటీవల నాగార్జునకి ప్రవీణ్ చెప్పడం జరిగిందని, నాగార్జున కూడా ఈ సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని ఏషియన్ మూవీస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించడానికి ముందుకి వచ్చినట్లు సమాచారం.ఇక ఈ సినిమా కంటెంట్ రీత్యా నాగార్జున కెరియర్ లో పెద్ద బడ్జెట్ తో తెరకెక్కబోతుందని టాక్ వినిపిస్తుంది.
నాగార్జున సినిమాని ఒకే చేసుకున్న ప్రవీణ్ సత్తారు గోపీచంద్ బయోపిక్ ని పక్కన పెట్టేసినట్లే అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.