అక్కడ మాస్క్ ధరించక పోతే గన్ తో షూట్ చేస్తున్నారంట...

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం వైద్యులు, పోలీసులు మరియు పారిశుద్ధ కార్మికులు నిరంతరంగా శ్రమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయినప్పటికీ ప్రజలు ఈ మధ్య లాక్ డౌన్ లో భాగంగా సడలింపులు చేపట్టడంతో మాస్కులు ధరించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా  నిర్లక్ష్యం వహిస్తూ  రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా సంచరిస్తున్నారు.

 Without Mask News,electric Gun, Pakistan, Islamic States, Lock Down, Mask And Sa-TeluguStop.com

దీంతో ఇస్లామిక్ దేశాలలో ఒకటయినటువంటి పాకిస్తాన్ దేశం రోడ్లపై మాస్కులు ధరించకుండా సంచరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా  మహిళలు లేదా పురుషులు ఎవరైనా సరే మాస్కులు లేకుండా రోడ్లపై సంచరిస్తే ఎలక్ట్రికల్ షార్ట్ గన్ తో షూట్ చేస్తున్నారు.

దీంతో ప్రజలు విలవిలాడి పోతున్నారు.దీంతో ప్రజా సంఘ నాయకులు ప్రభుత్వ అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం కొంత మంది ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ ప్రభావిత పరిస్థితులను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపై సంచకరిస్తున్నారని అలాంటి వారిని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.అంతేగాక మాస్కులు శానిటైజర్లు ఉపయోగించడం వల్ల కరోనా వైరస్ బారి నుంచి కొంత మేర తప్పించుకోవచ్చని కాబట్టి రోడ్ల పైకి వచ్చే ముందు ఖచ్చితంగా మాస్కులు ధరించి రావాలని ప్రజలకు ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటి వరకు పాకిస్థాన్ దేశంలో నమోదయినటువంటి కరోనా వైరస్ గణాంకాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,14000 పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 36 వేల పైచిలుకు మంది కరోనా వైరస్ బారి నుంచి విజయవంతంగా కోలుకున్నారు.మరో 2,225 మంది ప్రాణాలను కోల్పోయారు.

అయితే ఇప్పటివరకూ దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పంజాబ్ రాష్ట్రంలో  నమోదయ్యాయి.దీంతో ప్రభుత్వ అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube