ఐస్ క్రీం తిన్న పిల్లి రియాక్షన్ అదుర్స్ కదూ ...!

ఈ మధ్య మనుషుల మీద కంటే జంతువుల మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు మనుషులు.అయితే ఈ విషయంలో కొద్ది వరకు మంచి పని చేసినా… మరికొందరు ఎందుకో తెలియదు కానీ జంతువులపై వివిధ మార్గాల్లో వాటిని హింసిస్తూ ఉంటారు.

 After Eating Ice Cream Cat Expressing Is So Nice, Cat, Ice Cream, Social Media,-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే… మామూలుగా జంతువులు తమకిష్టమైన ఆహారాన్ని ముందుగా ముక్కుతో వాసన పసిగట్టి అది సురక్షితం అని తెలిసిన వెంటనే తినేందుకు మొగ్గు చూపుతాయి.

అయితే కొందరు జంతు యజమానులు మాత్రం ప్రేమగా తినిపిస్తే ఇంకేమీ ఆలోచించకుండా అవి అలాగే తినేస్థాయి కూడా.

అయితే ఇదే వరుసలో ఓ పిల్లి తన యజమాని ఎంతో ప్రేమగా ఇష్టంగా పెడుతుంటే ఐస్ క్రీం తిని ఓ రకమైన రియాక్షన్ ఇచ్చింది.నిజానికి ఆ సమయంలో పిల్లి ముఖకవళికలు చూస్తే అందరికీ నవ్వొస్తోంది.11 సెకండ్ల పాటు నడిచే ఆ వీడియోలో పిల్లి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దాని పళ్ళు జివ్వుమనడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకొని మూర్ఛ వచ్చినట్టుగా భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.అయితే ఈ ఎక్స్ప్రెషన్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా తన యజమాని డాన్ ఎల్లే పోస్ట్ చేశాడు.

అయితే ఈ వీడియో పెట్టిన కొద్దిసేపటికే ప్రపంచం మొత్తం బాగా వైరల్ అయిపోయింది.ఇప్పటివరకు ఆ వీడియోను లక్ష ఇరవై వేలమంది చూశారంటే ఆ పిల్లి ఎక్స్ప్రెషన్ ఎంత బాగా ఇచ్చిందో కదా.

అయితే ఎక్కడో ఓ చోట కొందరువివాదాస్పదంగా మాట్లాడేవారు ఉండకపోరు కదా అలాంటి వారు ఆ వీడియో చూసి అతి తక్కువ ఉష్ణోగ్రతతో ఐస్ క్రీం ని తినిపించడం నేరమంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఐస్ క్రీమ్ తినేందుకు మనుషులే కష్టపడతారు….అలాంటిది పిల్ల మూగ జీవి అయిన పిల్లి ఎలా తింటుంది.

దాని హింసించడం మంచిదేనా అంటూ వివిధ రకాలుగా నెటిజన్లు యజమాని మీద మండి పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube