ఎన్టీఆర్ కోసం అదిరిపోయే టైటిల్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

 Ntr Prashanth Neel Movie Title Confirmed, Ntr, Prashanth Neel, Ntr31, Nuclear, M-TeluguStop.com

ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రారంభించిన తారక్, తన 31వ చిత్రాన్ని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేసిన ప్రశాంత్ నీల్, ఈ సినిమా కథను తారక్‌కు వినిపించి ఓకే చియించుకున్నాడట.

ప్రస్తుతం కన్నడలో కేజీఎఫ్‌కు అదిరిపోయే సీక్వెల్‌ను రెడీ చేస్తున్న ప్రశాంత్, తారక్ కోసం అంతకు మించిన పవర్‌ఫుల్ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న క్లూ కూడా ఇచ్చాడు ఈ డైరెక్టర్.

ఇటీవల తారక్ పుట్టినరోజున ‘రేడియేషన్’ అనే పదాన్ని ఈ చిత్ర యూనిట్ వినియోగించింది.దీంతో అందరూ ఈ సినిమాకు అదే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు.

అయితే ఈ సినిమాకు మరో టైటిల్‌ను అనుకుంటున్నాడట చిత్ర దర్శకుడు.తారక్‌న పవర్‌ప్యాక్డ్‌గా మనకు చూపించబోతుండటంతో ఈ సినిమాకు న్యూక్లియర్ లేదా మిస్సైల్ అనే టైటిల్‌ను పెట్టాలని ప్రశాంత్ భావిస్తున్నాడట.

అందుకు సంబంధించి చిత్ర యూనిట్‌తో చర్చలు కూడా జరుపుతున్నాడని, ఈ సినిమాను లాంఛ్ చేసే నాటికి ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడట.మొత్తానికి కేజీఎఫ్‌ను మించిన సినిమాను తారక్‌తో ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

మరి ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube