దర్శకురాలి అవతారం ఎత్తిన బాలకృష్ణ హీరోయిన్

నందమూరి బాలకృష్ణకి జోడీగా లెజెండ్, లయిన్ సినిమాలలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే.ఈ అమ్మడు బాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు పాత్ర డిమాండ్ బట్టి బోల్డ్ గా న్యూడ్ గా నటించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.

 Radhika Apte Turns Director, Upcoming Digital Short Film, Bollywood, South Cinem-TeluguStop.com

ఇక హాలీవుడ్ సినిమాలలో కూడా ఈ మధ్య రాధికా ఆప్టే అవకాశాలు సొంతం చేసుకుంటుంది.ఇక ఈ అమ్మడుకి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే వివాదాలతో ఎక్కువ గుర్తింపు వచ్చింది.

నటిగా తనలో ఉన్న అన్ని కోణాలని ఆవిష్కరించే రాధికా ఆప్టేలో ప్రేక్షకులకి తెలియని మరో కోణం తాజాగా బయట పెట్టింది.

ఏకంగా మెగా ఫోన్ పట్టి దర్శకురాలి అవతారం ఎత్తింది.

మొదటి ప్రయత్నంగా ఓ షార్ట్ ఫిలిం తీసింది.నేచర్ మీద కాన్సెప్ట్ తయారు చేసుకొని 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ రాధికా తెరకెక్కించింది.

షహానా గోస్వామి గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ టీజర్ ని తాజాగా విడుదల చేశారు.ఇదిగో మా టీజర్ ట్రైలర్ అంటూ రాధిక ఇన్స్టాలో వీడియోను షేర్ చేసింది.

షార్ట్ ఫిల్మ్ కి స్లీప్ వాకర్ అనే టైటిల్ పెట్టారు.భార్య భర్తల మధ్య జరిగే సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.

నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్ షహానాను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది.టీజర్ చివరలో షహానా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి ఐ యామ్ సారీ అంటూ గుల్షన్ ఆమెను చిత్రహింసలకు గురిచేసే సీన్లు కాస్త భయంకరంగా ఉన్నాయని చెప్పాలి.

ఈ షార్ట్ ఫిల్మ్ లో మానవుడికి వాతావరణానికి గల ఒక స్పెషల్ రిలేషన్ ని చూపించాబోతున్నట్లు చెప్పిన విధంగానే అద్భుతంగా ఆవిష్కరించారు.నెటిజన్లు కూడా ఈ టీజర్ చూసి రాధికాలో ఈ కళ కూడా ఉందా అంటూ ప్రశంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube