రేడియేషన్‌తో కొట్టుకుంటున్న తారక్ ఫ్యాన్స్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

 Radiation A Clue In Ntr Prashanth Neel Movie, Ntr, Ntr31, Prashanth Neel, Kgf, T-TeluguStop.com

అయితే తారక్ ఈ సినిమా పూర్తిగాక ముందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 30వ చిత్రాన్ని ప్రారంభించాడు.

అటు ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ వరుసగా క్లూ ఇస్తూ ప్రేక్షకులను ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా చేస్తోంది.ఇటీవల తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘త్వరలోనే రేడియషన్ సూట్ వేసుకుని తారక్‌ను కలుస్తానని’ ప్రశాంత్ నీల్ అన్నాడు.

కాగా తాజాగా ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ‘త్వరలోనే ఆయన రేడియేషన్ సూట్‌లో కనిపిస్తాడని ఆశిస్తున్నాం’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

దీంతో ఎన్టీఆర్ 31వ చిత్రానికి సంబంధించిన కథకు రేడియేషన్‌తో ఏమిటి సంబంధమా అని అందూ తలలు పట్టుకుంటున్నారు.

ఏదేమైనా తారక్ కోసం ప్రశాంత్ నీల్ ఓ అదిరిపోయే సబ్జెక్ట్‌ను రెడీ చేసుంటాడని, అందుకే ఈ విధంగా చిత్ర యూనిట్ ఆసక్తిని పెంచుతోందని పులువురు సినీ విమర్శకులు అంటున్నారు.మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం మరో ఏడాది పాటు ఆగాల్సిందే అని వారు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube