18 రోజెస్ లో నిఖిల్ కి జోడీగా జంబలకిడిపంబ భామ

యంగ్ హీరో నిఖిల్ ఓ వైపు కార్తికేయ సీక్వెల్ ప్లాన్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్నాడు.దీంతో పాటు సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న 18 రోజెస్ సినిమాలో నిఖిల్ నటిస్తున్నాడు.

 18 Roses Movie Heroine Siddi Adnani, Tollywood, Telugu Cinema, South Cinema, Suk-TeluguStop.com

సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా ఇప్పటికే ఓపెనింగ్ జరుపుకుంది.అయితే ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాలని ముందు నుంచి భావిస్తున్నారు.

అలాగే అనూ ఇమాన్యూయేల్ పేరు కూడా వినిపించింది.అయితే క్యారెక్టర్ బట్టి వాళ్ళు సెట్ కారని కొత్త హీరోయిన్స్ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నం చేసింది.

సడెన్ హీరోయిన్ గా సిద్ధి ఇద్నానీ పేరు ఈ సినిమాలో హీరోయిన్ గా తెరపైకి వచ్చింది.ఈ భామ శ్రీనివాసరెడ్డి హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ జంబలకిడిపంబ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తరువాత అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అనే సినిమాలో నలుగురు అమ్మాయిలలో ఒకరుగా చేసింది.ఈ రెండు సినిమాలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే ఇప్పుడు సడెన్ గా 18 రోజెస్ సినిమా కోసం ఆమెని తీసుకోవడం నిజంగా ఆమె అదృష్టంగా భావించాలి.ఈ సినిమా ఎలాగూ మంచి హైప్ తో మార్కెట్ లోకి వెళ్తుంది.

హిట్ అయితే మాత్రం ఈ అమ్మడు ఫేట్ మారిపోవడం గ్యారెంటీ అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube