రికార్డులను పాతరేసేందుకు రెడీ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఎక్కడి వరకు వచ్చిందో అని అందరూ అనుకుంటున్నారు.

 Prabhas Fans Getting Ready For The Celebration, Prabhas, Prabhas 20, Pooja Hegde-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గాని ఫస్ట్ లుక్ పోస్టర్ గాని ఇంకా రిలీజ్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే వారికి సంతోషాన్ని కలిగించే వార్తను చెప్పేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ 20వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా జూన్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ సరొకత్తగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ అదే ఫిక్స్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.

ఈ నెలలోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండబోతుందనే వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్‌తో రికార్డులను పాతర వేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇటీవల మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రీలుక్ రిలీజ్ కాగా, మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దాన్ని ట్రెండింగ్‌లో ఉంచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు.

ఇప్పుడు ప్రభాస్ 20వ చిత్రంతో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.మరి వారు సృష్టించబోయే రికార్డుల సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందా అని ఇప్పుడే అంచనా వేస్తున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

ఇక ప్రభాస్ 20 చిత్రంలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube