కరోనా ఎఫ్ఫెక్ట్ : అమెరికాలో ఫుడ్ బ్యాంక్ కు నాట్స్ సాయం...

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన విలయం అందరికి తెలిసిందే.ముఖ్యంగా ఈ వైరస్ అమెరికాపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపించింది.

 Nats, North Texas Food Bank, Lockdown, Food Supply, America-TeluguStop.com

అధ్యక్షుడి అశ్రద్ద వలనో ప్రజలు సామాజిక దూరం పాటించక పోవడం వలనో మొత్తానికి లక్షమంది పైగా ప్రాణాలు కోల్పోయారు.అమెరికా ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యిపోయింది.

కోట్లాది మంది ఉపాది కోల్పోయారు.దిక్కు తోచని స్థితిలో ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలలో కోత పెట్టేస్తున్నాయి.

చివరికి తిండి దొరకని పరిస్థితులలో అమెరికాలో పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు అల్లాడి పోతున్నాయి.వారి కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్స్ ఎక్కడికక్కడ ఖాళీ అయ్యిపోతున్నాయి.

ఈ క్రమంలోనే.

అమెరికాలో తెలుగు ప్రజలు ఏర్పాటు చేసుకున్న నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) తమవంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

కరోనా వచ్చింది మొదలు అమెరికాలో అన్ని రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో ఉంటున్న నాట్స్ ప్రతినిధులు తమవంతు సాయం చేస్తూనే ఉన్నారు.తాజాగా డల్లాస్ లో నాట్స్ విభాగానికి చెందిన ప్రతినిధులు స్థానికంగా ఉన్న ఫుడ్ బ్యాంక్ కి 2000 ఫుడ్ క్యాన్స్ ని అందించారు.

పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అనే భావనతో అన్ని ప్రాంతాలలో పేదల ఆకలి తీర్చేందుకు నాట్స్ ఫుడ్ డ్రైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.ఇప్పటికే తమవంతుగా ఎన్నో ప్రాంతాలలో తమ సాయాన్ని అందించారు.

ఈ కార్యక్రమానికి వితరణ అందించిన నాట్స్ సభ్యులకి నాట్స్ ఉపాధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాట్స్ సభ్యులు పాల్గొన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube