కరోనా డేంజర్ బెల్స్: రెండేళ్ల లోపు చిన్నారుల మాస్క్ ల విషయం లో కలవరం

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ వైరస్ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

 Masks Dangerous For Children Under Two Years, Japan Experts, Masks,corona Effect-TeluguStop.com

ఇప్పటి వరకు దీనికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ముందు జాగ్రత్త చర్యలు ఒక్కటే ఆయుధంగా అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాస్క్ పెట్టుకోవడం, ఎప్పటి కప్పుడు శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పని సరి అని చెబుతుండడం తో చిన్నా,పెద్దా ప్రతి ఒక్కరూ కూడా ఆ నిబంధనలను పాటిస్తూ వస్తున్నారు.

అయితే చిన్నారుల విషయంలో సరికొత్తగా ఆందోళన మొదలైంది.ఎందుకంటే రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్కులు అత్యంత ప్రమాదకరమని జపాన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

చిన్నపిల్లలు మాస్కులు ధరించడం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

సాధారణంగా చిన్నారుల్లో శ్వాసమార్గం ఇరుకుగా ఉంటుందని అందుకే మాస్కు ధరించినప్పుడు గాలి పీల్చితే అది గుండెపై భారం పెంచుతుందని ఈ కారణంగా రెండేళ్ల లోపు చిన్నారులకు మాస్క్‌లు వేయకపోవటమే మంచిదంటూ వారు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube