ఆ డైరెక్టర్‌తో వెంకీ మామ వస్తాడా..?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Venkatesh Next Movie With Trinadha Rao, Venkatesh, Naarappa, Trinadha Rao, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి వెంకీ తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత వెంకీ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న ఎఫ్3 చిత్రంలో నటించేందుకు వెంకీ రెడీ అయ్యాడు.అటు మరో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో వెంకీ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

ఇక తాజాగా మరో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో రాబోయే ఓ కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో నటించేందుకు కూడా వెంకీ రెడీ అవుతున్నాడట.ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని, త్వరలోనే వెంకీకి దీన్ని వినిపించి ఓకే చేయించుకునేందుకు త్రినాథరావు సిద్ధమవుతున్నాడు.

ఒక్కసారి ఈ కథకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.

సురేష్ బాబు ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక నారప్ప చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించి రిలీజ్ చేయాలని వెంకీ చూస్తున్నాడు.

ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube