ఇలియానాకి అవకాశం ఇచ్చి ఆదుకున్న ఆర్ఆర్ఆర్ స్టార్

సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కన్నా గోవా బ్యూటీ ఇలియానాకి అక్కడ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.అయితే కొంత కాలం బాయ్ ఫ్రెండ్ తో ఫారిన్ లో సెటిల్ అయిపోయి అక్కడ బీచ్ లలో షికార్లు చేస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేసిన ఈ భామ అతనికి బ్రేక్ అప్ చెప్పేసి మళ్ళీ ముంబైలో సినిమా అవకాశాల కోసం వాలిపోయింది.

 Ileana Got One More Chance In Bollywood, Tollywood, South Cinema, Indian Cinema,-TeluguStop.com

అయితే అనుకున్న స్థాయిలో వెంటనే ఈ అమ్మడుకి ఎవరూ పిలిచి అవకాశం ఇవ్వలేదు.ఇంతలో లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.

కొత్త సినిమాలు మొదలుకాలేదు.దీంతో ఇలియానా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ఫాన్స్ కి దగ్గరగా ఉంటుంది.

తాజాగా చాలా గ్యాప్ తర్వాత మరో చిత్రంలో నటించే ఛాన్స్ ఇలియానా సొంతం చేసుకుంది.మొదటి నుంచీ బాలీవుడ్ లో గోవా బ్యూటీని ప్రోత్సహిస్తున్న హీరో స్టార్ హీరో, ఆర్ఆర్ఆర్ స్టార్ అజయ్ దేవగణ్ తాను నిర్మిస్తున్న ద బిగ్ బుల్ చిత్రంలో ఈ అమ్మడుకి అవకాశం ఇచ్చాడు.

మరో వైపు సౌత్ లో కూడా ఈమె సినిమా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ ఏజ్ లో ఇల్లీ బేబీపై మళ్ళీ మనసు పడే దర్శకులు ఉంటారా నేది చూడాలి.

బాలీవుడ్ లో మాత్రం ఏదో ఏడాదికి ఒక సినిమా చేస్తూ కాలం గడిపేస్తుంది.మొత్తానికి సౌత్ లో స్టార్ ఇమేజ్ ని వదులుకొని బాలీవుడ్ వెళ్ళినందుకు ఇల్లీ బేబీ చాలా నష్టపోయింది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube