థియేటర్ల ఓపెన్‌కు సినిమా వాళ్లే ఆసక్తిని కనబర్చడం లేదు

షూటింగ్స్‌ అనుమతి కోరుతున్న సినిమా వారు థియేటర్లను ఓపెన్‌ చేయమని మాత్రం ప్రభుత్వంను డిమాండ్‌ చేయలేక పోతుంది.ప్రభుత్వం కొన్ని ఆంక్షలతో థియేటర్లను సైతం ఓపెన్‌ చేసేందుకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

 Tollywood Cinima Producers And Stars Not Intrested To Open The Movie Theaters, C-TeluguStop.com

కాని సినిమా వారు మాత్రం థియేటర్ల గురించి ఇప్పుడు మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు.మొన్న చిరంజీవి అండ్‌ టీం కేసీఆర్‌తో మాట్లాడినప్పుడు కాని, కేంద్ర మంత్రి కిషర్‌ రెడ్డితో మాట్లాడినప్పుడు కాని థియేట్ల విషయంలో ఎక్కువ చర్చ జరగలేదు.

Telugu Chiranjeevi, Coronavirus, Lock, Suresh Babu, Theaters, Tollywood-Movie

లాక్‌డౌన్‌ సడలించినా కూడా థియేటర్లు మరో రెండు మూడు నెలలు అధనంగా మూసి ఉంచడం బెటర్‌ అంటూ ఒకానొక సమయంలో స్వయంగా సురేష్‌బాబు మీడియా ముందు అన్నాడు.ఆయన అన్నట్లుగానే షూటింగ్స్‌ జూన్‌ నుండి ప్రారంభం అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నుండి థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.థియేటర్లు ఇప్పట్లో ఓపెన్‌ అయినా ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదు.కనుక ఓపెన్‌ చేసి నష్టాల పాలవ్వడం కంటే ఓపెన్‌ చేయకుండా ఉండటం ఉత్తమం అనేది ఇండస్ట్రీ పెద్దల వాదన.

ప్రభుత్వాలు మాత్రం మొత్తం అన్నింటికి గేట్లు ఎత్తివేసేందుకు రెడీగా ఉంది.వచ్చే నెలలోనే థియేటర్లు కూడా ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

కాని ఆ అవకాశంను సినిమా వారు కోరుకోవడం లేదు.అంత అవసరం ఇప్పుడు లేదని, అలా చేయడం వల్ల మరింత నష్టం తప్పదనే ఉద్దేశ్యంతో రెండు మూడు నెలల వరకు థియేటర్లను మూసే ఉంచాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube