కరోనా టైం లో బామ్మను హత్తుకున్న మనవడు,కానీ..కండీషన్ అప్లైడ్

కరోనా మహమ్మారి తో అత్యంత ఆప్తులను హత్తుకోవడం సంగతి పక్కన పెడితే అసలు కనీసం చేతులు ఇచ్చి పలకరించడానికి కూడా భయపడి పోతున్నారు.ఈ మహమ్మారి బంధాలను కూడా దూరం చేసేస్తుంది.

 The Hug Of Granny And Grandson Goes Viral, Coronavirus, Granny ,grandson, Anand-TeluguStop.com

ప్రాణాంతకమైన ఈ మహమ్మారికి భయపడి చాలా మంది దూర దూరంగానే ఉంటున్నారు.అయితే శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా ఇలా ప్రియమైన వారిని హత్తుకోవడం కోసం ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరచింది.

కావిన్ అనే వ్యక్తి తన బామ్మను హత్తుకోవాలని అనిపించడం తో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఒక ఉపాయం చేశాడు.కరోనా కాదు దాని జేజెమ్మ వచ్చినా కూడా ఎవరికీ ఏమి కానీ రీతిలో ఒక కర్టెన్ ను తయారు చేశాడు.

Telugu Anand Mahindra, Coronavirus, Grandson, Granny, Kadil Courtain, Ideas-Gene

నిలువెత్తు ప్లాస్టిక్ కర్టెన్‌కు చేతులకు వేసుకునే పొడవాటి గ్లౌజ్ తగిలించాడు.ఇంకేముంది తిన్నగా వెళ్లి తనకు ఎంతో ప్రియమైన బామ్మను గాట్టిగా వాటేసుకున్నాడు.ఈ వీడియో కావిన్, అతని భార్య మిరియం ముందుగా ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.కడిల్ కర్టెన్ అని పిలిచే ఈ తెరకు అటూఇటూ నిల్చుని బామ్మ, మనుమడు కావలించుకున్న వీడియో నెట్‌లో వైరల్ అయింది.56 లక్షల మంది ఈ వీడియోను చూశారు అంటే నిజంగా అది ఎంతగా వైరల్ అయ్యిందో అర్ధం అవుతుంది.చాలామంది ఈ వీడియోను చూసి కళ్లు వత్తుకున్నట్టు కామెంట్లు పెట్టారు.

నాకూ మా తాతను కడిల్ కర్టెన్‌తో కావలించుకోవాలని ఉంది అంటూ ఒక నెటిజన్ బదులిచ్చాడు.కొత్త ఐడియాలను మనసారా ఆహ్వానించి అభినందించే తత్వమున్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను షేర్ చేసి మరోసారి సోషల్ మీడియా లో ట్రోల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube