థియేటర్లు లేక అడవిలో కలిసిపోతున్న రానా సినిమా

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వాటిని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.బాహుబలి చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో నటించి మెప్పించిన రానా, ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

 Rana Aranya Movie To Skip Theatre Release, Rana Daggubati, Aranya Movie, Haathi-TeluguStop.com

ముఖ్యంగా హీరోగా రానా చాలా సెలెక్టివ్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ఈ క్రమంలో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న రానా, తాజాగా అరణ్య అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు.

బాలీవుడ్‌లో ‘హాతీ మేరే సాతీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా ఓ డిఫరెంట్ గెటప్‌లో మనకు కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు.

కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నారు.దీంతో ఈ సినిమాను లాక్‌డౌన్ అనంతరం రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

కానీ లాక్‌డౌన్ అనుకున్న సమయానికంటే కూడా ఎక్కువ ఉండటంతో అరణ్య సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో మొదలైంది.

కాగా ప్రస్తుతం ఓటీటీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడటంతో అరణ్య సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అరణ్య చిత్ర యూనిట్‌కు భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాను ప్రభు సోలోమాన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube