ఇస్మార్ట్ శంకర్ చిత్రం సక్సెస్‌తో జోరు మీదున్న దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.భారీ చిత్రాల నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.
పూరి, ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపుగా సగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ చిత్రం టైటిల్ విషయంలో ఒక నిర్మాత అయిన ఛార్మి క్లారిటీ ఇచ్చింది.
మొదట ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత ఈ సినిమాకు లైగర్ అనే విచిత్రమైన విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది.
కాని అవన్నీ కూడా నిజం కాదని ఛార్మి క్లారిటీ ఇచ్చింది.విజయ్ మూవీ కోసం ఒక మంచి టైటిల్‌ను పూరి ఇప్పటికే రిజిస్ట్రర్ చేశారు.అది ఒక మంచి సందర్బంలో రివీల్ చేస్తామని ప్రకటించింది.

లైగర్, ఫైటర్ కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది.టైటిల్ విషయంలో పూరి చాలా క్రియేటివిటీతో ఆలోచిస్తాడని ఈ సినిమా కోసం కూడా ఆయన అలాగే ఆలోచించాడు అంటూ చెప్పుకొచ్చింది.ఈ చిత్రం టైటిల్ మరో లెవల్‌లో ఉంటుందని ఆమె నమ్మకంగా చెప్పింది.
త్వరలోనే రౌడీ స్టార్ మూవీ టైటిల్‌ను ప్రకటిస్తామంటూ పేర్కొంది.ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.